● జాతీయ పత్రికా దినోత్సవంలో సబ్‌కలెక్టర్ భగత్ సామల్ కళ్యాణ్ రావ్
పర్లాకిమిడి: జాతీయ పత్రికా దినోత్సవాన్ని స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాలులో సోమవారం జిల్లా స్థాయిలో జరుపుకున్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ భగత్ సామల్ కళ్యాణ్ రావ్ విచ్చేయగా, ముఖ్యవక్తగా పత్రికా సంపాదకులు ద్విజేంద్రనాథ్ పాఢి, గౌరవ అతిథిగా రాష్ట్ర యూనియన్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు గరుడధ్వజ చౌదురి, వోయూజే అధ్యక్షులు బసంత పండ, సనోజ్ పట్నాయక్, డీపీఆర్వో ప్రదిప్తగురుమయి పాల్గొన్నారు. పత్రికా విలేకరి సమాజంలో బాధ్యాయుత కర్తవ్యమన్నారు. ఇటీవల అర్నబ్ తుపాను వల్ల గజపతి జిల్లాలో పలు సమితిల్లో సంభవించిన నష్టాన్ని పరిశీలించేందుకు తాము వెళ్లలేకపోయినప్పటికీ విలేకరులు ద్వారా చాలా తెలుసుకున్నామని సబ్ కలెక్టర్ కళ్యాణ్ రావ్ అన్నారు. జిల్లా అధికార యంత్రాంగంకు మీడియా ఒకవారధిగా పనిచేస్తున్నదని ఆమె అన్నారు. 36 గంటల్లో రానున్న మరో తుపానుపై సమీక్షించడానికి మోహానాబ్లాక్‌కు వెళ్లడం వల్ల జిల్లాకలెక్టర్ జాతీయ పత్రికా దినోత్సవం సమావేశానికి హాజరు కాలేకపోయారని సబ్‌కలెక్టర్ కళ్యాణ్‌రావ్ వివరించారు. సమావేశంలో పలువురు విలేకరులు గరుడ చౌదురి, భాగవత్ పాఢి, సంతోష్ పట్నాయిక్ తదితరులు జర్నలిజం, పాప్యులారిటీ, మరియు బాధ్యాయుత జర్నలిజంపై మాట్లాడారు. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ ఆదర్శదాస్ సభికులకు ధన్యవాదాలు తెలియజేశారు.
జర్నలిజంలో బాధ్యతాయుత విధులకు ప్రాధాన్యం
రాయగడ:ప్రజాదరణ, వేగవంతమై ప్రచారం కంటే వాస్తవాలు, విశ్వసనీయత, నిష్పాక్షికత, సామాజిక బాధ్యతలకు జర్నలిస్టులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలకమైన నాలుగో స్తంభమని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలకు తెలియజేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో జాతీయ ప్రెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం, జిల్లా సమాచార, ప్రజా సంబంధాల శాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్ర నాఽథ్ కహార్ అధ్యక్షత వహించగా ఎస్‌డీసీ ఉపాధ్యాక్షురాలు మంజుల మినియాక, సమితి చైర్మన్ టున్ని హుయికలు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. అలాగే కలహండి జిల్లా భవానీపట్నంలోని మా మాణికేశ్వరి విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఉమేష్ చంద్ర శతపతి ముఖ్యవక్తగా, రాయగడ కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి రాయ్ గౌరవ అథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యవక్త డాక్టర్ శతపతి మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో వార్త వేగం, ప్రజాదరణ కంటే వాటి నిజానిజాలు, విశ్వసనీయత, సామాజిక బాధ్యత ముఖ్యమన్నారు. వార్తల ప్రచారంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలను నిర్ధారించడం, నిష్పాక్షికతకు కట్టుబడి ఉండటం జర్నలిస్టులకు సవాల్‌గా మారిందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు.


