శ్రీజగన్నాథ మందిరం ఆవరణలో సంగీత విభావరి | - | Sakshi
Sakshi News home page

శ్రీజగన్నాథ మందిరం ఆవరణలో సంగీత విభావరి

Nov 17 2026 12:38 AM | Updated on Nov 17 2026 12:38 AM

పర్లాకిమిడి: స్థానిక శ్రీజగన్నాథ మందిరం ప్రాంగణంలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని భక్తి పుష్పాంజలి సాంస్కృతిక సంసద్‌ ఆధ్వర్యంలో భక్తి పాటల విభావరిని మహాంత రామానంద దాస్‌ ప్రారంభించారు. ఏటా కార్తీక మాసం, దేవదీపావళి నాటు నిర్వహించే భక్తి పుష్పాంజలి సంస్థ భువనేశ్వర్‌ నుంచి విచ్చేసిన సంగీత దర్శకుడు శ్రీకర్‌పాఢి ఆధ్వర్యంలో భక్తిపాటల విభావరి జరిపించారు. కార్యక్రమంలో పట్టణంలో ప్రముఖ వస్త్ర వ్యాపార వేత్త బరాటం నాగేశ్వరరావు, బంగారం, వెండి వ్యాపారవేత్త పొట్నూరు రామకృష్ణ, అంతర్జాతీయ క్లాసిక్‌ డ్యాన్సర్‌ తనీషా బెబర్తా, భక్తి సంగీత సంసద్‌ కార్యదర్శి పూర్ణచంద్ర మహాపాత్రో తదితరులను దుశ్శాలువ, తామ్రపత్రంతో సబ్‌కలెక్టర్‌ భగత్‌ సామల్‌ కళ్యాణ్‌ రావ్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ్‌ సేవాదళ్‌ సభ్యుడు దుర్గా ప్రసాద్‌ పాణిగ్రాహి, వ్యాఖ్యాతగా ఆదర్శదాస్‌, భక్తి పుష్పాంజలి సంసద్‌ కార్యదర్శి జయంత్‌ మహాపాత్రో, కార్యక్రమం నిర్వాహకులు హేమంత్‌ పట్నాయిక్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తనీషా బెబర్తా ఒడిస్సీ నృత్యంతో ప్రేక్షకులను అలరించింది. ఈ భక్తి సంగీత కచేరిలో అనేకమంది సంగీత ప్రియులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement