ముగిసిన వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

పర్లాకిమిడి: నవంబరు పదో తారీఖు నుండి 13 వరకూ జరిగిన 70వ రాష్ట్రస్థాయి పాఠశాలల వాలీబాల్‌ పోటీలు నేటితో ముగిశాయి. గజపతి జిల్లాలో రాయగడ బ్లాక్‌ పి.యం.శ్రీ ప్రభుత్వ ఎస్‌ఎస్‌డీ సెకండరీ పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో నాలుగు విభాగాలలో 30 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 14 ఏళ్ల లోపు బాలుర విభాగంలో గజపతి జట్టు చాంపియన్‌షిప్‌ విజేతగా నిలవగా, పూరీ జిల్లా రన్నరప్‌గా నిలిచింది. అలాగే అండర్‌ 14 బాలికల విభాగంలో కలహండి జట్టు చాంపియన్‌షిప్‌ గెలుచుకోగా, నువాపడా జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచింది. 17 ఏళ్ల లోపు బాలుర విభాగంలో పూరీ చాంపియన్‌షిప్‌ గెలుచుకోగా, బాలసోర్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అండర్‌–17 బాలికల విభాగంలో భువనేశ్వర్‌ జట్టు విజేతగా చాంపియన్‌షిప్‌ కప్‌ గెలుచుకోగా, రన్నరప్‌గా ఢెంకనాల్‌ జట్టు నిలిచింది. బహుమతి ప్రధాన సభలో ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్‌ అధికారి దయామయా పాఢి విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. విజేతలు ఇంకాస్త మెరుగైన ఆట ఆడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ట్రోఫీ పొందాలని పాఢి అన్నారు. కార్యక్రమంలో డీఈఓ మయాధర్‌ సాహు, కంధమాల్‌ శారీరిక విద్య ఇన్‌స్పెక్టర్‌ సంజయకుమార్‌ పాత్రో, గజపతి జిల్లా పాఠశాలల పీఈటీ సురేంద్ర కుమార్‌ పాత్రో, అదనపు డీఈఓ ఎస్‌.గిరిధర్‌, రాయఘడ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సురేష్‌ సాహుకార్‌, ఆర్‌.ఉదయగిరి బ్లాక్‌ విద్యాధికారి బిరేంద్ర కుమార్‌ మండళ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement