రాయగడలో ఉత్సాహంగా వాలీబాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రాయగడలో ఉత్సాహంగా వాలీబాల్‌ పోటీలు

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

పర్లాకిమిడి: గజపతిలో క్రీడల ప్రాముఖ్యత, క్రమశిక్షణ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు గర్వకారణమని జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, ముఖ్యఅతిధి గవర తిరుపతి అన్నారు. ఆయన గజపతి జిల్లా రాయగడ బ్లాక్‌ ప్రభుత్వ ఎస్‌ఎస్‌డీ ఉన్నత మాధ్యమిక పాఠశాల ప్రాంగణంలో డబ్బైవ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ స్కూళ్ల జట్టు చాంపియన్‌ షిప్‌ పోటీలను గవర తిరుపతిరావు ప్రారంభిస్తూ మాట్లాడారు. ఈపోటీలకు రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి 1300 మంది 14–17 ఏళ్ల లోపు వారు వచ్చారు. నాలుగు రోజుల పాటు రాయగడలో జరిగే వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఇతర అతిథులుగా యస్‌.డి.సీ. చైర్మన్‌ కామదేవ్‌ బోడోనాయక్‌, ఎంపీ ప్రతినిధి రొక్కం రాంప్రసాద్‌, రాయగడ సమితి చైర్మన్‌ పూర్ణబాసి నాయక్‌, ఉపాధ్యక్షుడు జ్యోతి కుమార్‌ పాణి, ఒడిషా మాధ్యమిక విద్యాశాఖ డైరక్టర్‌ (భువనేశ్వర్‌) అసిస్టెంటు డైరక్టర్‌ జ్యోతిప్రసాద్‌ పరిడా, అదనపు డీఈఓ ఎస్‌.గిరిధర్‌, రాయగడ బ్లాక్‌ విద్యాధికారి టి.కిశోర్‌, మోహన, ఆర్‌.ఉదయగిరి బీఈఓ బీరేంద్ర మండళ్‌ విచ్చేశారు. గజపతి జిల్లా ముఖ్యవిద్యాధికారి డాక్టర్‌ మయాధర్‌ సాహు క్రీడాకారులు, అతితులను ఉద్దేశించి స్వాగత ఉపన్యాసం చేశారు. వేదిక నిర్వహణకు ముఖ్య యాంకర్‌గా ఉపాధ్యాయిని శులతా శుభదర్శినీ మిశ్రో, ఎం.వెంకట్‌లు పాల్గొన్నారు. తొలిరోజు గజపతిజిల్లా రాయగడ, బోరిగుమ్మ విద్యార్థుల మధ్య అండర్‌–14 వాలీబాల్‌ పోటీ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement