ఫుట్‌బాల్ టోర్నీ విజేత.. ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా బొడొకావిడి నిలిచింది. బహుమతులు అందజేశారు. –8లోu
కళాశాలల్లో ఉచిత ఇంటర్నెట్ ఇవ్వనున్నారు. ఏర్పాట్లు చేస్తున్నారు. –8లోu
● రానున్న రోజుల్లో మరింత తీవ్రం
భువనేశ్వర్: ఒడిశాలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పొడి వాతావరణం కొనసాగుతుండటంతో రాత్రివేళ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత ఫుల్బాణి, ఝార్సుగుడలో 14.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కంధమల్‌లోని దారింగిబాడిలో 14 డిగ్రీల సెల్సియస్ , గంజాం జిల్లా గోపాల్పూర్‌లో 20.5 డిగ్రీల సెల్సియస్, భవానీపట్నలో 14.6 డిగ్రీల సెల్సియస్, నవరంగ్‌పూర్‌లో 15 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. పశ్చిమ ఒడిశాలోనూ చలి ప్రభావం కొనసాగుతోంది. రూర్కెలాలో 15.7 డిగ్రీల సెల్సియస్, హిరాకుడ్‌లో 16 డిగ్రీల సెల్సియస్, సంబల్‌పూర్‌లో 16.2 డిగ్రీల సెల్సియస్, కెందుఝర్‌లో 16.6 డిగ్రీల సెల్సియస్, రాయగడలో 16.6 డిగ్రీల సెల్సియస్, బొలంగీర్‌లో 17.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని భువనేశ్వర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 18.5 డిగ్రీల సెల్సియస్, కటక్‌లో 17.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తీరప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, రాత్రివేళ చలి క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో మంగళవారం పొడి వాతావరణమే కొనసాగినట్లు భువనేశ్వర్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కొండ ప్రాంతాల్లో మరింత చలి
ఎత్తైన ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. కొరాపుట్ జిల్లాలోని సిమిలిగుడలో 11.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో రాత్రి చలి తీవ్రతను ఈ ఉష్ణోగ్రతలు స్పష్టం చేస్తున్నాయి.
మైదానాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్
పగటి ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత నయాగఢ్‌లో 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భువనేశ్వర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 31.6 డిగ్రీల సెల్సియస్, కటక్‌లో 29.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో పగటి వేడి, రాత్రి చలి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతల్లో మరింత తగ్గుదల నమోదయ్యే అవకాశాలపై వాతావరణ పరిస్థితులను ఐఎండీ పరిశీలిస్తోంది.
ఉత్తర ఒడిశాలో చెదురుమదురు వర్షాలు
ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మయూర్‌భంజ్, కెందుఝర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 13 నుంచి రాష్ట్రంలో వాతావరణం మరింత పొడిగా మారే అవకాశముంది.
బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం
బంగాళా ఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలపై ఐఎండీ నిఘా కొనసాగిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13 నాటికి అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అంచనా. ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నందున దాని ప్రభావంతో ఒడిశా వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.


