అదుగో పులి..ఇదిగో తోక | - | Sakshi
Sakshi News home page

అదుగో పులి..ఇదిగో తోక

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లాలో పెద్ద పులి రాకతో అనేక వదంతులు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. మంగళవారం రోజంతా పెద్ద పులి చిత్రాలు సోషల్‌ మీడియాలో షికారు చేశాయి. ఏఐ పరిజ్ఞా నంతో కొరాపుట్‌ జిల్లా పరిసర ప్రాంతాలను కలిపి ఈ చిత్రాలు పలువురు విడుదల చేశారు. దాంతో అనేక ప్రాంతాలలో భయాందోళనలు వ్యక్తం అయ్యా యి. పెద్ద పులి రాకని అటవీ శాఖ ఉన్నతాధికారులు ధ్రువీకరించినా దాన్ని ఇంత వరకు ఎవరూ చూడ లేదని తేల్చేశారు. ఇంత వరకు పులి కాలి ముద్రలు, వెంట్రుకలు మాత్రమే గు ర్తించారు. కానీ ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదు. ప్రస్తుతం పులి ఈ ప్రాంతంలో ఇంకా ఉందో లేదో తెలియదు కానీ పుకార్ల తో ప్రజలు హడలి పోతున్నారు. ఈ పెద్ద పులి రోజుకు 15–20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.అయినప్పటికీ ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నా రు. మరో వైపు పులి కదలికల కోసం సిబ్బంది అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్‌ ల పర్యవేక్షణ కొనసాగుతోంది.

మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా మహిళల ధర్నా

జయపురం: సబ్‌ డివిజన్‌లోని పలు గ్రామాల్లో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు, స్వయం సహాయక గ్రూపుల సభ్యులు ఆందోళనలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ స్ఫూర్తితో జయపురం సమితి ధన్‌పూర్‌ గ్రామ పంచాయతీ మహిళలు మద్యం వ్యతిరేక ఆందోళనను మంగళవారం చేపట్టారు. వందలాది మంది తమ గ్రామ పంచాయతీని మధు ముక్తి పంచాయతీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ధన్‌పూర్‌ పంచాయతీ నుంచి వెళ్లి జయపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ధన్‌పూర్‌ గ్రామ పంచాయతీలోని అనేక గ్రామాల్లో మ ద్యం, నాటుసారా అక్రమంగా అమ్ముతున్నారని ఆరోపించారు. దీనివలన కుటుంబ కలహాలు, అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాల్లో కొ ట్లాటలు, సామాజిక సమస్యలతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. అందువలన మద్యం, సారా అమ్మకాలు నిషేధించాల ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మహిళా నేతలు ఫూల్‌మణి గదబ, మీనతి మల్లిక్‌, సుభ ద్ర హరిజన్‌, మాధవి గదబ, లక్ష్మీ జాని, గుప్త జాని, ధనపూర్‌ సర్పంచ్‌ బలభద్ర గదబ తదితరులు పాల్గొన్నారు.

లంచం తీసుకున్నందుకు బలియాపాల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తొలగింపు

భువనేశ్వర్‌: అవినీతిపై కఠిన చర్యల్లో భాగంగా, బాలేశ్వర్‌ జిల్లాలో ఓఆర్‌ఎస్‌ (ప్రొబేషన్‌లో ఉన్న) బలియాపాల్‌ సబ్‌రిజిస్ట్రార్‌, మనీషా మిశ్రా సేవలను ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, నవంబర్‌ 6వ తేదీన రిజిస్ట్రేషన్‌ మరియు సేల్‌ డీడ్‌ జారీ కోసం పంచరూఖి గ్రామానికి చెందిన ఫిర్యాదిదారుడు జ్ఞాన రంజన్‌ పాత్రో నుంచి రూ. 7,000 లంచం గుంజుతుండగా బాలేశ్వర్‌ డివిజన్‌ విజిలెన్స్‌ అధికారు లు పట్టుకున్నారు. బాలేశ్వర్‌ విజిలెన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా ఆమెను నవంబర్‌ 7న అరెస్టు చేసి కోర్టుకు తరలించగా, అక్కడ ఆమెకు నవంబర్‌ 20 వరకు జైలు కస్టడీ విధించారు. గవర్నర్‌ ఆదేశం మేరకు ఒడిశా ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1959లోని నిబంధన–3ను నేరుగా ఉల్లంఘిస్తోందని పేర్కొని ప్రభుత్వం ఆమె సేవలను తక్షణమే రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చెరువులో మునిగి 17 ఏళ్ల యువతి మృతి

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా శిఖ్‌పల్లి పంచాయతీ యంవీ 18 గ్రామంలో దీపా సానా (17) గ్రామంలో చెరువులో మునిగి మృతి చెందింది. సోమవారం మధ్యా హ్నం సమయంలో దీప కాలకృత్యాల కోసం చెరువు వద్దకు వెళ్లి కాలుజారి పడిపోయింది. నీరు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయింది. అయితే కుమార్తె ఎంత సేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతా గాలించారు. అటుగా వెళ్లిన గ్రామస్తులు చెరువు వద్ద దుస్తులు కనిపించడంతో అనుమానంతో వెతకగా దీప మృతదే హం కనిపించింది. వెంటనే మల్కన్‌గిరి ఆస్పత్రికి తరలించినా వైద్యులు దీప మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మల్కన్‌గిరి పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement