ఒకే ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు | - | Sakshi
Sakshi News home page

ఒకే ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

కొరాపుట్‌ : నకిలీ ఓట్లు తొలగిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటనలు గుప్పిస్తోంది. సర్‌ వలన ఈ ఓట్లు తొలగిపోతాయని కేంద్రం ప్రకటిస్తోంది. కానీ ఈ నిబంధన ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాకి వర్తించదా అనే ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీలో 21 గిరిజన గ్రామాల ప్రజలకు ఒడిశా రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్నట్లు ప్రభుత్వం కార్డులు అందజేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పార్వతీ పురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని 5 గ్రామ పంచాయతీలలో ఈ 21 కొఠియా గ్రామాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఇది ఎలా సాద్యం అని ప్రస్తుతం ప్రశ్న తలెత్తింది. సర్‌ నిబంధనల్లో సామాన్య ఓటరు తనను తాను గుర్తింపు ఇచ్చుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కానీ ఏకంగా 21 గ్రామాల ప్రజలకు రెండు రాష్ట్రాల ఓట్లు ఎలా సాధ్యం అయ్యాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొఠియా అంశం ప్రచార అంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement