12 నుంచి సమ్మెలోకి మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

12 నుంచి సమ్మెలోకి మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

పర్లాకిమిడి: పట్టణంలోని పురపాలక సంఘంలో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న స్వీపర్స్‌, చెత్తబండ్ల డ్రైవర్లు ఉద్యమ బాట పట్టారు. మంగళవారం పొరుగుసేవల పురపాలక సిబ్బంది తమ సమస్యలను మున్సిపల్‌ చైర్బన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌కు నివేదించారు. గత రెండేళ్లుగా చెత్తబండ్ల డ్రైవర్లు, స్వీపర్స్‌గా పనిచేస్తున్న కార్మికులకు అతి తక్కువ జమ చేస్తున్నారని, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ స్లిప్పు లేదా పాస్‌బుక్‌ల వివరాలు తమకు ఇవ్వడం లేదని కలెక్టరేట్‌ వద్ద పురపాలక సంఘం కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు వారి సమస్యలను వినతి రూపంలో అందజేశారు. అలాగే జిల్లా కార్మిక ఉపాధి అధికారి బాబు చరణ్‌పాత్రోకు కూడా వినతి పత్రాన్ని అందజేశారు. పురపాలక సంఘంలో పొరుగుసేవల ఉద్యోగులుగా 150 మంది పనిచేస్తున్నామని, ఎందుకు ప్రతినెలా జీతం కోత విధిస్తున్నారని కార్మికులు డీఎల్‌ఓ వద్ద విన్నవించారు. తమ బాధలు పట్టించుకోకుంటే నవంబరు 12 నుండి పురపాలక సంఘం సేవలు నిలిపి వేసి ఆందోళనకు దిగుతామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement