జయపురం: జయపురం విధాన సభ నియోజకవర్గం బొరిగుమ్మలో బీజేడీ సీనియర్ నేత ఆ సమితిలో టికి పట్నాయక్‌గా పేరుగాంచిన వివేకానంద పట్నాయక్‌ను మాజీ మంత్రి రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షుడు రబినారాయణ నందో కొంతమంది పార్టీ నేతలతో కలిసి మంగళవారం కలిశారు. ఇటీవల టికి పట్నాయక్ పార్టీ వీడతారన్న వదంతులు వస్తున్న సమయంలో మాజీ మంత్రి అతడిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి రబి నందో టికి పట్నాయక్‌తో కలసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నందో మాట్లాడుతూ.. టికి పట్నాయక్ కొరాపుట్ జిల్లాలో బిజూ జనతా దళ్‌లో ఒక సీనియర్, సమర్థవంతమైన నేతే కాకుండా పార్టీ శ్రేణులకు మార్గదర్శకులు అన్నారు. టికి పట్నాయక్‌ను కలిసిన వారిలో కొరాపుట్ జిల్లా బీజేడీ కార్యవర్గ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మిశ్ర, బొరిగుమ్మ బీజేడీ నేత నాగరాజు దొర తదితరులు పాల్గొన్నారు.


