25 కిలోల గంజాయి స్వాఽధీనం | - | Sakshi
Sakshi News home page

25 కిలోల గంజాయి స్వాఽధీనం

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

– ఇద్దరు మహిళల అరెస్టు

రాయగడ: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను మునిగుడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు మునిగుడ బస్టాండ్‌లో పోలీసులు కాపలా కాశారు. అదే సమయంలో ఇద్దరు మహిళలు అనుమానస్పదంగా ఉండడంతో వారి బ్యాగ్‌లను పోలీసులు తనిఖీ చేయగా.. అందులో గంజాయి పట్టుబడింది. మహిళలను అరెస్టు చేసి మంగళవారం కోర్టుకు తరలించారు. మునిగుడ ఐఐసీ లలిత్‌ మోహన్‌ సాగర్‌ ఈ దాడులకు నేతృత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement