పర్లాకిమిడి: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో గజపతి జిల్లాలో వరదలు, కొండచరియలు విరిగిపడటం, పంట నష్టంపై రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యశాసన కార్యదర్శి అన్ను గార్గ్ , రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల శాఖ మంత్రి సురేష్ పూజారిని మంగళవారం భువనేశ్వర్లో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కలిశారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేయలేదన్నారు. పంట నష్టంపై అధికారులు ఇప్పటివరకు నివేదికలు పంపలేదన్నారు. భవిష్యత్తులో కొండచరియలు విరిగిపడకుండా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సురేష్ పూజారిని కోరారు. మహేంద్రతనయ నదికి ఆనుకున్న బుసుకిడి గ్రామంలో రక్షణ గోడలు నిర్మించాలని మంత్రి సురేష్ పూజారిని విన్నవించారు.


