కొరాపుట్‌ పర్వ్‌–2026ను ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

కొరాపుట్‌ పర్వ్‌–2026ను ఘనంగా నిర్వహించాలి

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

జయపురం: త్వరలో కొరాపుట్‌లో జరుగనున్న రాష్ట్ర స్థాయి ఆదివాసీ సాంస్కృతిక ఉత్సవం, కొరాపుట్‌ పర్వ్‌–2026 శుభారంభ స్థలాన్ని కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌ మంగళవారం సందర్శించారు. పర్వ్‌ ప్రారంభ ఏర్పాట్లపై సమీక్షించారు. కుంధ్ర సమితి బాగ్దేరీ గ్రామ పంచాయతీలో 5 స్థలాలను పరిశీలించారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ సమస్యపై సమీక్షించారు. పర్వ్‌ ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే జనసమూహ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలను కుంధ్రా సమితి అధికారులకు, కుంధ్ర పోలీసు అధికారి అశ్విణీ పట్నాయక్‌ను వివరించారు. ప్రారంభ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, తప్పులు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. కుంధ్ర సమితిలో ఉన్న బాగ్దేరిలో గల బుడి ఠకురాణి నుంచి పర్వ్‌ 2026 ప్రారంభించనున్నారు. ఆ ప్రాంతంలో గల జగన్నాథ్‌ మందిరం, శివ మందిరం, మవులి ఠకురాణి మందిరాల నుంచి శోభాజాతర నిర్వహించుకుంటూ పర్వ్‌ మసాలా వెలిగించే ప్రాంతానికి చేరుకుంటారు. కొట్‌పాడ్‌ ఎమ్మెల్యే రూపు భొత్ర, జయపురం సబ్‌కలెక్టర్‌ శుభ్ర పండా, కొరాపుట్‌ జిల్లా అభివృద్ధి విభాగ అధికారి బేణూదర శబర, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు రాధా బినోద్‌ సామంతరాయ్‌, కుంధ్ర పంచాయతీ అధ్యక్షుడు బణిత కందాలియ, బీడీఓ పి.మనస్మిత, తహసీల్దార్‌ బినోద్‌ చంద్రనాయక్‌, జిల్లా పరిషత్‌ సభ్యులు కనకలత పెంటియలు ఏర్పాట్ల పైసమీక్షించారు. బాగ్దేరిలో జగన్నాథ్‌ విద్యాపీఠం ప్రాంగణంలో ప్రధాన సభా వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బాగ్దేరి–రామగిరి, బాగ్దేరి కుంధ్ర, బాగ్దేరి–రాణిగుడ, బాగ్దేరి–తిసారిగుడ మార్గాల్లో వాహనాలు నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్‌ వర్మ ఆదేశించారు. పర్వ్‌ ప్రారంభోత్సవంలో 20 వేలకుపైగా ప్రజలు పాల్గొంటారని అధికారుల అంచనా. సభావేదిక ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని బీడీఓను కలెక్టర్‌ ఆదేశించారు. పర్వ్‌ లో స్థానిక కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతినిధి బద్రి నారాయణ ఆచార్య, చంద్ర సాగరియ, శరత్‌ చంద్ర దాస్‌, ఎంపీ ప్రతినిధి అంబు పాత్రో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement