రాయగడ: ప్రపంచ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌కు చెందిన బీఎస్సీ విద్యార్థులు మంగళవారం జిల్లా ప్రధాన హస్పిటల్‌లో విస్తృత ప్రజారోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం టీకాలు అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హస్సిటల్‌లో గల ప్రసవానంతరం వార్డు (పి.ఎన్.సి), ప్రత్యేక నవజాతి శిశు సంరక్షణ యూనిట్ నరీక్షన గది, తదితర ప్రాంతాల్లో విద్యార్థులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భిణులు, రోగులు, వారి బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సార్వత్రిక టీకా కార్యక్రమం, జాతీయ టీకా షెడ్యూల్ ప్రకారం పిల్లలకు నిర్ణీత సమయంలో టీకాలు వేయించాల్సిన అవసరాన్ని విద్యార్థులు వివరించారు. పల్స్ పోలియో కార్యక్రమం ప్రాముఖ్యతతోపాటు పిల్లలకు సకాలంలో బూస్టర్ డోస్‌లు అందించాల్సిన అవశ్యకతను తెలియజేశారు. టీకాల అనంతరం సంభవించే ప్రతికూల ఘటనలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకాల సామర్థ్యాన్ని కాపాడేందుకు కొల్డ్‌చైన్ వ్యవస్థ నిర్వహణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీకాలపై సమాజంలో ఉన్న అపోహలను తొలగిస్తూ పిల్లల ఆరోగ్య వివరాలను మదర్ అండ్ చైల్డ్ ప్రొటక్షన్ కార్డులో క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు.


