జయపురం: జయపురం విక్రమదేవ్ వర్మ విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో జయపురం మోర్నింగ్ క్లబ్ నిర్వహించిన ఫుట్‌బాల్ ఫెస్టివల్ 2026 టోర్నమెంట్‌లో జయపురం సమితి బొడొకావిడి టీమ్ విజేత అయి విన్నర్‌గా నిలిచింది. టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరిన బొడొకావిడి, బరిణిపుట్ టీములు విన్నర్‌గా విజయం సాధించేందుకు శక్తివంతంగా పోరాడాయి. బొడొకావిడి టీమ్ విన్నర్‌గా విజయం సాధించింది. బరిణిపుట్ టీమ్ రన్నర్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన బహుమతి ప్రధాన ఉత్సవంలో జయపురం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్‌లో తలపడిన రెండు టీమ్‌లు ప్రతిభావంతంగా ఆడాయన్నారు. జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.


