మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి తర్లకొట్ట పంచాయతీ సోమనాథ్‌పూర్ గ్రామం వద్ద ఆదివారం రాత్రి స్కూటీ–ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. దీపావళి సందర్భంగా కుం ఖోరా తన మేనల్లుడు రాజ్ ఖీలో మరో యువకుడు రాజేష్ ముగ్గరు కుడుముల గూమ్మ వెళ్లి తిరిగి వస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి ఇసుక లోడ్‌తో వస్తున్న ఓ ట్రాక్టర్ సోమనాథ్ పూర్ పాఠశాల మలుపు వద్ద బలంగా స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదంలో రాజ్ ఖిలో(18)తో పాటు సోమవారం ఉదయం చికిత్స పోందుతూ కుం ఖోరా(51) మృతి చెందాడు. రాజేష్‌ను మల్కన్‌గిరి నుంచి కొరాపుట్ తరలించారు. బలిమెల పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఐసీ రీగాన్‌కీండో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.


