మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి గాగిరిమెట్ల గ్రామ సమీపంలోని అడవిలో అక్రమంగా రవాణా చేసేందుకు ఉంచిన గంజాయిని కలిమెల పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ముందస్తు సమాచారం మేరకు ఆదివారం రాత్రి దాడి చేసినట్లు ఐఐసీ దేబదత్త బిశ్వల్ తెలిపారు. పోలీసుల రాకను గమనించిన గంజాయి మాఫీయా సభ్యులు పారారై, గంజాయి బస్తాలను విడిచిపెట్టారు. గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఐఐసీ ప్రభుదత్త బిశ్వల్, తహసీల్దార్ సమక్షంలో తూకం వేశారు. పట్టుబడిన గంజాయి 1,325 కిలోలు ఉందని, దీని విలువ రూ.90 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ గంజాయి ఎవరికి చెందిందో తెలుసుకోవాలని ఐసీసీ ఆదేశించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వలస కూలి మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కేంద్రం చాకలివీధికి చెందిన లింగరాజ్ శెట్టి (38) హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. లింగరాజ్ గత 9 నెలలుగా హైదరాబాద్‌లోని ఓ కాంట్రాక్టర్ వద్ద కూలి పనిచేస్తున్నాడు. తోటివారితో కలిసి అక్కడే ఉంటూ భార్యాపిల్లలకు డబ్బులు పంపించేవాడు. దీపావళికి ఇంటికి వద్దామని బస్టాండ్‌కు వెళ్తుండగా పికప్ వ్యాన్ ఢీకొని మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారు కూడా మల్కన్‌గిరికి చెందిన వారే. లింగరాజ్ మృతదేహన్ని తోటి కూలీలు సోమవారం ఉదయం మల్కన్‌గిరికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఎమ్మెల్యేల శాసన నైపుణ్యాలపై దృష్టి
భువనేశ్వర్: ఒడిశా శాసన సభ సభ్యుల కోసం నవంబర్ 16న ప్రత్యేక అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రెండు రోజుల ఒడిశా పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి ప్ర సంగించనున్నారు. ముఖ్యంగా శాసన సభ క మిటీల పనితీరు, వాటి బాధ్యతలు, ప్రభుత్వ శాఖల పనితీరుపై సమర్థమైన పర్యవేక్షణ, ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల అమలును సమీక్షించే విధానాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించనున్నారు.
మూడు సెషన్లుగా కార్యక్రమం
శాసన సభ స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన ఒకరోజు కార్యక్రమం మూడు సెషన్లుగా జరుగుతుంది. ప్రారంభ సెషన్‌లో గవర్నర్ బ్రజ్‌మోహన్ రామ్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, స్పీకర్ పాల్గొంటారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, శాసన సభలో ప్రస్తుతం 35 పార్లమెంటరీ కమిటీలు ఉన్నాయి. వీటి పని తీరును మరింత బలోపేతం చేయడం, కమిటీలు చేసే సిఫారసులు, నిర్ణయాల అమలును సమర్థంగా పర్యవేక్షించేలా ఎమ్మెల్యేల నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చించనున్నారు.
బడ్జెట్ ప్రక్రియపైనా శిక్షణ
తదుపరి బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పె ట్టుకుని బడ్జెట్ ప్రక్రియ, శాఖలకు నిధుల కేటా యింపు, వ్యయ వివరాలు, బడ్జెట్ అంచనాలు, గ్రాంట్లు, శాఖల పనితీరును అంచనా వేసే విధానాలపై కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నా రు. ప్రశ్నోత్తరాల సమయంలో సమర్థంగా పాల్గొనడం, ప్రజా ప్రాధాన్యత ఉన్న అంశాలను సభలో ప్రస్తావించడం, వాస్తవ ఆధారాలతో నిర్మాణాత్మక చర్చలు నిర్వహించడం వంటి అంశాలపై మార్గదర్శకత్వం అందిస్తారు.
ఇప్పటికే ఒకసారి ఓరియెంటేషన్
మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం ఏర్పడిన తొలి దశలోనే, 2024 ఆగస్టు 17, 18 తేదీల్లో కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల కోసం రెండు రో జుల ఓరియెంటేషన్ కార్యక్రమం శాసన సభ ప్రాంగణంలో నిర్వహించిన విషయం గమ నార్హం. ఆ కార్యక్రమంలో సభా వ్యవహారాలు, నియమ నిబంధనలు, కమిటీల పనితీరు, బడ్జెట్ ప్రక్రియ, సభ్యుల హక్కులు, బాధ్యతలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అందువల్ల నవంబర్ 16న జరగనున్న కార్యక్రమం గత ఓరియెంటేషన్‌కు కొనసాగింపుగా శాసనసభ్యుల శాసన నైపుణ్యాలు, కమి టీ వ్యవస్థ, బడ్జెట్ పర్యవేక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కార్యక్రమంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 31 వరకు శాసన సభ శీతా కాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది.


