చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొమట్లపేట హనుమాన్‌ నగర్‌లో నివసిస్తున్న ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేంద్ర కుమార్‌ శర్మ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 70.620 గ్రాముల బంగారు ఆభరణాలు, 356.670 గ్రాములు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చందిలి పోలీసులు వివరాలను వెల్లడించారు. అక్టోబరు 16వ తేదీ అర్ధ రాత్రి సమయంలో కొందరు దుండగులు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేంద్ర కుమార్‌ శర్మ నివాసంలోకి తలుపులు పగులగొట్టి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని అల్మారాలో భద్రపరిచిన బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.2.50 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటనపై బాధితుడు చందిలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైంటిఫిక్‌ బృందం సహకారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముందుగా జగన్నాథ కడ్రక అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించిగా లభించిన సమాచారం మేరకు మరో నిందితుడు హేమంత్‌ పాలకను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ఇద్దరు నిందితులు జేకేపూర్‌ భటిపొడ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఎస్‌డీపీఓ గౌరహరి సాహు, చందిలి ఐఐసీ ఉత్తమ్‌ కుమార్‌ సాహు ఈ వివరాలను వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement