అభాగ్యుల ముఖాల్లో చిరునవ్వు | - | Sakshi
Sakshi News home page

అభాగ్యుల ముఖాల్లో చిరునవ్వు

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి కలెక్టర్‌ ప్రధమేశ్‌ దీపావళి సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న నిరుపేదలు, అనాథలు, వృద్ధులతో దీపావళి చేసుకోవాలని నిర్ణయించి జిల్లాలోని పలు అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి ప్రత్యేకంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. నాయక్‌గూడ గ్రామం వద్ద ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడు ఎరమాబాక జిల్లా ప్రత్యేక పాఠశాలకు వెళ్లి అక్కడ 84 మంది విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి మందుగుండు సామాన్లు ఇచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్‌ సోమనాథ్‌ ప్రధాన్‌ కూడా వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధులతో దీపావళి జరుపుకున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని పరివర్తన్‌ అనాథాశ్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వేద్బర్‌ ప్రధాన్‌ తోపాటు ఇతర అధికారులు వెళ్లి చిన్నారులతో దీపావళి నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement