కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో పెద్ద పులి సంచారంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద పులి వచ్చిందని అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. సునాబెడా టౌన్ షిప్‌లో పులి రాకని గుర్తించారు. సోమవారం వేకువ జామున దమంజోడి ప్రాంతంలో పులి గర్జనలు వినిపించాయని ప్రజలు పేర్కొన్నారు. దాంతో అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతం లో గాలింపులు చేస్తున్నారు. కొరాపుట్ జిల్లాలో తప్పని సరి పరిస్థితిలో మాత్రమే ప్రజలు అడవికి వెళ్లాలని అధికారులు ప్రకటించారు. రాత్రి పూట ఒంటరిగా బయట ప్రాంతాల్లో తిరగ వద్దన్నారు. ఇప్పటికే పులి కాలి అడుగు ముద్రలు, వెంట్రుకలు అటవీ సిబ్బంది గుర్తించారు. ఈ పులి రోజుకు 15 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే 4 గేదెలపై పులి దాడి చేసినట్లు చిత్రాలు విడుదల అయ్యాయి. పులి కదలికలు కోసం సీసీ కెమెరాలు, డ్రోన్‌లు వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలతో ప్రజలు భయకంపితులవుతున్నారు.


