‘మన కళాకారుల’ ఎంపిక ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘మన కళాకారుల’ ఎంపిక ప్రారంభం

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా స్థాయిలో ఎంపిక చేసి వారిని వివిధ ఉత్సవాలు, బలిజాత్ర, ప్రభుత్వ పథకాల ప్రచారానికి వినియోగిండడానికి ‘మన కళాకారులు’ పేరిట స్థానిక టౌన్‌ హాల్‌లో సోమవారం ఎంపికలు ప్రారంభించారు. వీరిలో చాలామంది కీర్తన మండలి సభ్య బృందానికి పింఛన్‌ కూడా ప్రభుత్వం అందజేస్తుంది. సోమవారం నుంచి 14వ తేదీ వరకు స్థానిక టౌన్‌హాల్‌లో కీర్తన మండలి, గస్కాటీ కళాకారుల బృందాలను ఎంపిక చేసే ప్రక్రియలో జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్‌ ఉన్నారు.

కీర్తన మండలి ఎంపికలకు న్యాయనిర్ణేతలుగా ఆకాశవాణి తబలా కళాకారులు, సంగీత దర్శకులు రఽఘునాథ పాత్రో, నృసింహాచరణ్‌ పట్నాయక్‌ (క్రియేటివ్‌ ఆర్ట్స్‌), ప్రఫుల్ల కుమార్‌ బిశ్వాల్‌, హారికృష్ణ బిశ్వాల్‌ వ్యవహరించారు. గజపతి జిల్లా నుంచి గుసానిబ్లాక్‌ కెరండీ, జాజిపురం, బాగుసల, కుడ్డడ, గురండీ, బడగాం, కంట్రగడ గ్రామాల నుంచి సోమవారం కళాకార బృందాలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement