పర్లాకిమిడి: కార్తీక సోమవారం సందర్భంగా స్థానిక జగన్నాథ మందిరంలో జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనం కల్పించారు. ఒడియా వారికి ఇది మూడో సోమవారం, ప్రవాసాంధ్రులు నేటి నుంచి తోలి సోమవారం నిర్వహించుకుంటున్నారు. పట్టణంలో గోపీశ్వర ఆలయం, పోడుగు కోవెల, ఎండల మల్లికార్జున ఆలయం, రామసాగరంలో రామలింగేశ్వర ఆలయం, ఏకాంబరీశ్వర, బలుంకేశ్వర ఆలయాలు కార్తీక మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి.
మా శ్యామకాళీ ఉత్సవాలు ప్రారంభం
పర్లాకిమిడి: పట్టణంలో నెహ్రూ జంక్షన్ వద్ద అమావాస్య రాత్రి మా శ్యామకాళీ ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. దీపావళి నుంచి పదకోండు రోజులపాటు నిర్వహించే మా శ్యామకాళీ ఉత్సవాలు పర్లాకిమిడిలో గత 30 ఏళ్లుగా శ్యామకాళీ కమిటీ నిర్వహిస్తున్నట్టు భరత్ భూషన్ మహంతి తెలియజేశారు. ప్రతిరోజూ అమ్మవారికి రాత్రిపూట పూజలు, సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని కార్యదర్శి సనోజ్‌పట్నాయక్ తెలియజేశారు.
ఆర్థిక సహాయం అందజేత
పర్లాకిమిడి: గుమ్మాబ్లాక్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్సుసెల్‌కు అధిక స్పందన లభించింది. గుమ్మాబ్లాక్‌లో సెరంగో, అజయగడ, నమ్మన గుడ గ్రామ పంచాయతీల నుంచి మొత్తం 31 వినతులు అందాయి. వాటిలో కొన్నింటిని జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్ పరిష్కరించారు.
జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగల స్వశక్తీకరణ విభాగం తరఫున ఇద్దరికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అగర్వాల్ అందజేశారు. కొందరికి ఇళ్ల పట్టాల ఆర్.ఓ.ఆర్‌లను అందజేశారు. అనేకమంది నెలసరి వృద్ధాప్య పింఛను, రేషన్ కార్డుల కోసం కలెక్టర్‌ను అభ్యర్థిచారు. నేటి గ్రీవెన్స్‌కు జిల్లా పరిషత్ సీడీవో దయామయ పాఢి, సబ్‌కలెక్టర్ భగత్ సామల్ కళ్యాణ్ రావ్, గుమ్మాబ్లాక్ చైర్మన్ సునేమీ మండళ్, బీడీవో దులారాం మరాండీ పాల్గొన్నారు.


