కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న కోరోణోసాయి గ్రామస్తులు
పర్లాకిమిడి: జిల్లాలో రాయఘడ బ్లాక్ ఎస్.కోరడాసింగి పంచాయతీ కోరోణో సాయి గ్రామానికి గ్రామీణ రోడ్లు (ఆర్.డి.) శాఖ పక్కా రోడ్డు వేయాలని గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు.
గత ప్రభుత్వంలో మట్టి రోడ్డు ఉండేదని, ఇటీవల సంభవించిన అర్నాబ్ తుఫాన్‌కు ఉన్న రోడ్డు కూడా కొట్టుకుపోయిందని ప్రశాంత్ ప్రధాన్ తెలియజేశారు. ప్రస్తుతం గర్భిణులు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని గ్రామస్తులు తెలియజేశారు. వెంటనే అధికారులు తమ గ్రామానికి రోడ్డు వేయాలని ఏడీఎం ఫల్గుణి మఝికి వినతిపత్రాన్ని అందజేశారు.


