బలిమెల గ్రీవెన్స్‌లో 120 వినతులు స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బలిమెల గ్రీవెన్స్‌లో 120 వినతులు స్వీకరణ

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల ఎన్‌ఏసీలో సోమవారం జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 120 వినతులు అందాయి. వీటిని పరిశీలించిన అధికారులు కొన్ని వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రధమేశ్‌ ఆదేశించారు. అలాగే రెడ్‌క్రాస్‌ నిధుల నంచి పలువురికి ఆర్థిక సహాయం చేశారు. అలాగే కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు అందించేందుకు లేబర్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ గ్రీవెన్స్‌ శిబిరం వద్ద మోబైల్‌ కంటి వైద్య వాహనం ఏర్పాటు చేసి వృద్దులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికు కళ్లద్దాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్‌పటేల్‌, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్‌, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా సబ్‌ కలెక్టర్‌ దూర్యోధన్‌ బోయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement