జయపురం: రైతుల ఆదాయం వృద్ధి పరచి స్వావలంబన సాధించే లక్ష్యంతో జయపురంలో మత్య్స విభాగ ఆధ్వర్యంలో సమితి వ్యవసాయ శాఖ వారు వరి– మత్య్స పంటల సాగుపై సోమవారం ఒకోరోజు వర్క్‌షాపును నిర్వహించారు. వర్క్‌షాపులో జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్, జయపురం, బొరిగుమ్మ రైతులలో వరి పంటతో పాటు చేపల పెంపకం ద్వారా ఎలా అధిక లబ్ధి పొందగలరో అధికారులు రైతులకు ప్రత్యేకంగా వివరించారు. వర్క్‌షాపులో జయపురం, బొరిగుమ్మ, కొట్‌పాడ్ సమితిల నుంచి వందకు పైగా రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వ మత్స్య అధికారులు, జూనియర్ మత్స్య సాంకేతిక సహాయ అధికారులు పాల్గొని వరి పంటతో పాటు చేపలు ఎలా పెంచాలన్నది రైతులకు వివరించారు. కటక్ సెంట్రల్ వరి పరిశోధన సంస్థ ప్రధాన సైంటిస్టు డాక్టర్ అనిపూణమ్ వరి ఉత్పత్తిను 57 శాతం నుంచి 61 శాతానికి పెంచేందుకు శాసీ్త్రయ, సాంకేతిక పద్ధతులను రైతులకు వివరించారు. క్లస్టర్ అప్రోచ్ ద్వారా సామూహిక చేపల సాగు క్షేత్రాలు ఏర్పాటు చేయాలని మత్య్స విభాగ అధికారులు రైతులకు సూచించారు. వరి పంటలో చేపలు పండించే విధానం, వాటిని నిర్వహించే పద్ధతులు, యాజమాన్యం మొదలగు విషయాలను వారు రైతులకు వివరించారు.


