పర్లాకిమిడి: గుసాని సమితి ఉప్పలాడ గ్రామంలో జాతీయ న్యాయసేవల దినోత్సవం సందర్భంగా జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధ్యక్షుడు జగదీష్ ప్రసాద్ మహంతి ర్యాలీని టాగోర్ మెమొరియల్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభించారు. జాతీయ న్యాయసేవల దినోత్సవం సందర్భంగా ఉచిత న్యాయసేవలపై అవగాహన, దాని ప్రాముఖ్యత, బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనపై జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి మాట్లాడారు. విద్యార్థులు బాలకార్మికుల వ్యవస్థపై ఒక రూపకం ప్రదర్శించారు. న్యాయసేవలు, బాలకార్మికుల నిర్మూలనపై నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను జిల్లా జడ్జి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవల ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రౌళో, క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మండళ లోకనాథం, లింగరాజ్ పాణిగ్రాహి మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు వై.ధర్మారావు ధన్యవాదాలు తెలియజేశారు.


