జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. న్యాయ సేవా ప్రదీకరణ జిల్లా అధ్యక్షుడు, జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి అధ్యక్షతన న్యాయ సేవా ప్రదీకరణ సభాగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రసంగిస్తూ కోర్టులో విచారణలో ఉన్న కేసులు ప్రీ–లిటిగేషన్ కేసులు మధ్యవర్తుల ద్వారా లేక కోర్టుల ద్వారా పరిష్కరించటం, శిక్షణ పొందిన న్యాయవాదులు పారా లీగల్ వలంటీర్ల పాత్ర, ఉచిత న్యాయ సహాయం, తదితర అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో విజిలెన్స్ జడ్జి మానస కుమార్ పండ, ఫ్యామిలీ జడ్జి నిశీత్ నిశంక, సిజేఎం ఎస్.శుభలక్ష్మీ, సీనియర్ సివిల్ జడ్జి స్వయం ప్రకాశ దాస్ తదితర విభాగాల న్యాయమూర్తులు ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.


