● కొరాపుట్ జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్ వెల్లడి
కొరాపుట్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల ఐదో తేదీన జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కొఠియా ప్రాంత ప్రజలు కేవలం పది శాతం మాత్రమే ఓట్లు వేశారని కొరాపుట్ జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్ వెల్లడించారు. కొరాపుట్ కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ సత్యవాన్ మహాజన్ వివరాలు తెలియజేశారు. మొత్తం కొఠియా గ్రామాల ప్రజలు కేవలం పది శాతం మాత్రమే పోలింగ్ పాల్గొన్నారన్నారు. వారిని కూడా ప్రలోభ పెట్టి ఒటింగ్‌లో పాల్గొనేటట్లు చేశారన్నారు. 40 శాతం పోలింగ్‌లో పాల్గొన్నరన్న వార్తలు కొట్టి పారేశారు. తన వద్ద గ్రౌండ్ రిపోర్ట్ ఉందన్నారు. ఈ విడత కొఠియాలో ఏ గ్రామంలో కూడా ఆంధ్ర పోలింగ్ బూత్ ఏర్పాటు చేయలేక పోయిందన్నారు. ఇది ఒక విజయమన్నారు. ఎన్నికలప్పుడు వచ్చే వారి మాటలకు ఇక పై చెల్లు బాటు చేస్తామన్నారు. కొఠియా గ్రామాల్లో విస్తృత అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసులు చూరగొంటామన్నారు. ప్రజలే అభివృద్ధి కావాలా లేదా ఎన్నికలప్పుడు వచ్చే దళారుల కావాలో తేల్చుకుంటారని కలెక్టర్ అన్నారు.


