పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో శుక్రవారం హైబ్రిడ్ పద్ధతిలో 6వ అంతర్జాతీయ జీఐఎస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైజ్ఞానికులు, ఐకార్ మరియు ఐఐయస్.డబ్లూ.సీ. పి.రాజా జ్యోతిని వెలిగించి జీఐఎస్ దినోత్సవం ప్రారంభించారు. సెంచూరియన్ వర్సిటీలో డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ అంతర్జాతీయ సెమినార్‌లో డాక్టర్ ప్రఫుల్లపండా స్వాగత ఉపన్యాసం చేయగా, ఆర్‌ఎం ఎస్‌ఐ ప్రైవేటు లిమిటెడ్ సహా ఉపాధ్యక్షులు యు.బాలాజీ, రిజిస్ట్రార్ అనితా పాత్రో, మెక్సికో జాతీయ పాలిటెక్నిక్ సంస్థ ప్రొఫెసర్ ఎం.పి.జోనాథన్, ఐకార్ ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ పి.రాజా, విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. జియో స్పేషియల్, రిమోట్ సెన్సింగ్, కృత్రిమ మేధస్సు తోడైతే భూమండలంపై విపత్తుల నుంచి ముప్పు తగ్గించేందుకు ఎలా దోహాద పడగలదో బ్లూమండ్ అసోసియేట్ ఇండియా కంపెనీకి చెందిన ప్రొఫెసర్ ప్రభాత్ రంజన్ జెన్నా వివరించారు. దీనిపై స్క్రీన్‌పై పవర్ ప్రెజెంటేషన్ ఆయన ఇచ్చారు. ఈ అంతర్జాతీయ సెమినార్‌లో బెంగళూరుకు చెందిన అగస్థ్య గ్రూప్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజరు, తుబుస్సుమ్ రోజీ సుస్థిరమైన అభివృద్ధి, రవాణా, నీరు, పర్యావరణ నిర్వహణ కోసం జియో ఏఐ ద్వారా నిర్వహించ గలమని తెలియజేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో దుబాయ్ విశ్వవిద్యాలయం డాక్టర్ సూర్య దేవ్ చక్రవర్తి భూపరిశీలన, ఎస్‌ఐఆర్, జియో ఏఐ పర్యావరణ స్థితి స్థాపకం, విపత్తుల నుంచి ముప్పు నుంచి బయటపడటం వంటి విషయాలపై ప్రసగించారు.


