ఐఏఎస్‌ అధికారులకు బదిలీలు | - | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ అధికారులకు బదిలీలు

Nov 7 2026 1:48 AM | Updated on Nov 7 2026 1:48 AM

భువనేశ్వర్‌: రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ కేడర్‌లో మార్పులు చేపట్టింది. గవర్నర్‌ ఆమోదంతో సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా అటవీ అభివృద్ధి సంస్థ చేర్మన్‌, కేబీకే ముఖ్య నిర్వాహకుడిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ బిష్ణుపద సెఠిని, సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖలో ప్రత్యేక విధి అధికారిగా (ఓఎస్‌డీ) నియమించారు.పంచాయతీరాజ్‌, తాగునీటి శాఖలో కమిషనర్‌ కమ్‌ సెక్రటరీగా పని చేస్తున్న గిరీష్‌ ఎస్‌.ఎన్‌ బదిలీ చేసి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు ప్రభుత్వ కమిషనర్‌ కమ్‌ సెక్రటరీగా నియమించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కమ్‌ సెక్రటరీగా, ఒడిశా స్టేట్‌ ఇన్‌నిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఇనిషియేటివ్స్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అశ్వతి ఎస్‌, ఆర్థిక శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర డిప్యుటేషన్‌ నుంచి తిరిగి వచ్చిన రూపా మిశ్రా, పంచాయతీ రాజ్‌ మరియు తాగునీటి శాఖకు కమిషనర్‌ కమ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.

రూ.2.38 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

మల్కన్‌గిరి: ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చత్తీస్‌గఢ్‌ పోలీసులు ఒడిశా బోడార్‌లో గురువారం రాత్రి పట్టుకున్నారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఓ పికప్‌ వ్యాన్‌లో 15 బస్తాల్లో తరలిస్తున్న సుమారు 476 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. నిందితులు మల్కన్‌గిరి జిల్లాకు చెందిన వారు. ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా భగవన్‌ పంగి, ఘాసి ఖిలో, చిత్రసేన్‌ గల్లోరీ, రోహిన గల్లోరిని అరెస్టు చేశారు. వీరిని జగదల్‌పూర్‌కు తరలించారు. అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు. ఈ గంజాయి విలువ రూ.2కోట్ల 38 లక్షలు ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement