పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్ కిత్తంగి గ్రామంలో గత రాత్రి గున్న ఏనుగులు చొరబడటంతో అటవీ శాఖ అధికారులు గస్తీ కాశారు. విషయం తెలుసుకున్న పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి చేరుకుని కిత్తంగి గ్రామశివార్లలో ఏనుగుల గుంపు చూడటానికి రెండు కిలోమీటర్లు కాలి నడకన చేరుకుని అక్కడి అటవీ అధికారులు ఏనుగుల కదలికలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. కిత్తంగి గ్రామాస్తుల ఆస్తులు, ప్రజల ప్రాణహాని నుంచి భద్రత కల్పించాలని అటవీ అధికారులను కోరారు. ఇటీవల తుఫాన్ గ్రామీణ మంచినీరు, శానిటేషన్ పనులు కిత్తంగిలో జరుగుతుండగా క్రిష్ణ అనే ఉద్యోగి నది దాడుటుండగా మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే రూపేష పాణిగ్రాహి క్రిష్ణ ఇంటికి వెళ్లి వారి భార్య, బంధువులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు (జోన్.6) యస్.బాలరాజు ఉన్నారు.


