హైటెక్‌ డెంటల్‌ కాలేజీలో ఓరియెంటేషన్‌ | - | Sakshi
Sakshi News home page

హైటెక్‌ డెంటల్‌ కాలేజీలో ఓరియెంటేషన్‌

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

భువనేశ్వర్‌: హైటెక్‌ డెంటల్‌ కాలేజీలో నూతన బీడీఎస్‌ విద్యార్థుల కోసం ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలికి, కళాశాల, క్యాంపస్‌లోని సౌకర్యాలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా హైటెక్‌ గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో రాణించాలంటే ఓర్పు, సున్నితత్వం, ధైర్యం, సమయపాలన, మానవత్వం వంటి లక్షణాలు ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థి దశ నుంచే ఈ గుణాలను అలవర్చుకోవాలని సూచించారు. ఎంబీబీఎస్‌ అయినా, బీడీఎస్‌ అయినా ప్రతి వైద్యుడు రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. హైటెక్‌ మేనేజింగ్‌ ట్రస్టీ సురేష్‌ పాణిగ్రాహి మాట్లాడుతూ.. విద్యార్థుల కంటే వారి తల్లిదండ్రులే ఎంతో అదృష్టవంతులని, తమ పిల్లలు వైద్య విద్యలో అడుగుపెట్టాలన్న వారి కల నెరవేరిందని అన్నారు.

హైటెక్‌ డెంటల్‌ కాలేజీ తాత్కాలిక అధ్యక్షురాలు ఇంజనీర్‌ మధుస్మిత త్రిపాఠి మాట్లాడుతూ.. నైపుణ్యం కలిగిన దంత వైద్యులుగా ఎదగడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కళాశాలలో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఓర్పు, అంకితభావంతో విద్యను అభ్యసిస్తూ రోగులకు సేవ చేయడం ద్వారా మంచి దంత వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. హైటెక్‌ వైద్య, పరిపాలనా విభాగాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీతారాం మహాపాత్రో మాట్లాడుతూ.. దంత వైద్యులు ఏ విషయంలోనూ ఎంబీబీఎస్‌ వైద్యులకు తీసిపోరని అన్నారు. ఉద్యోగ, వృత్తిపరమైన గౌరవం తదితర అంశాల్లో వారు సమాన స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజీ పోలీస్‌ సతీష్‌ గజ్వీ, ఐపీఎస్‌ మాట్లాడుతూ.. దంత వైద్యం ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. మారుతున్న జీవన విధానం, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో దంత వైద్యుల అవసరం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్టీ అంకితా పాణిగ్రాహి, సీఈఓ డాక్టర్‌ ఇషా జునేజా, హైటెక్‌ డెంటల్‌ కాలేజీ చైర్మనన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ పాత్రో, హైటెక్‌ మెడికల్‌ కాలేజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ దేబానంద మహాపాత్రో, డీన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాధామాధవ్‌ త్రిపాఠి, డెంటల్‌ కాలేజీలోని వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement