మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభీమాన్ ఏరియా ధూలిపూట్ పంచాయతీ జుమాడాండ్ గ్రామంలో నివసిస్తున్న 45 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామం ఽఆంధ్రా అల్లూరి జిల్లా పేదబాయిల్ మండలం ఇంజారి పంచాయతీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామం మాత్రం పూర్తిగా ఒడిశాలోనే ఉంది. ఒడిశా పథకాలు వీరికి అందకపోవడంతో వీరంతా ఆంధ్రాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు నిర్ణయించుకోగా.. అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. తమ 12 డిమాండ్లు నెరవేరిస్తేనే ఉంటామని, లేదంటే ఆంధ్రాలో కలిసిపోతామని వారు తేల్చి చెప్పారు. ఆంధ్రా తరహాలో సంక్షేమ పథకాలు అందించాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ కు డిమాండ్లతో వినతి పత్రం అందజేశారు.


