నాలుగు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

నాలుగు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు శంకుస్థాపన

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

మల్కన్‌గిరి: ఒడిశా రాష్ట ప్రభుత్వ పాఠశాలలు, సామూహిక విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నాలుగు గోదాబర్‌ మిశ్రో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు శంకుస్థాపన చేశారు. మల్కన్‌గిరి సమితి గోరాఖుంట ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మడ్కామి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు . జిల్లాస్థాయిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్‌ పాణిగ్రాహి, జిల్లా అభివృద్ధి అధికారి దశరాథి సరాబు పాల్గొన్నారు. అదేవిధంగా పోడియా సమితి ఉండురకొండ వద్ద జరిగిన శంకుస్థాపనలో కలిమెల సమితి విద్యాశాఖ అధికారి రమోష్‌ బరోయి హాజరయ్యారు. మల్కన్‌గిరి సమితి సిమిలిబంచ్‌ వద్ద పోడియా సమితి విద్యాశాఖ అధికారి స్వప్నేశ్వర్‌ నాయక్‌ శంకుస్థాపన చేశారు. అలాగే ఖోయిర్‌పూట్‌ సమితి మాడ్కపోదర్‌ వద్ద జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి మంజులాతా బోయ్‌ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement