● మార్కెట్‌లోకి సరికొత్త దీపావళి ప్రమిదలు ● వివిధ ఆకృతుల్లో తయారీ ● ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారులు | - | Sakshi
Sakshi News home page

● మార్కెట్‌లోకి సరికొత్త దీపావళి ప్రమిదలు ● వివిధ ఆకృతుల్లో తయారీ ● ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారులు

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

● మార్కెట్‌లోకి సరికొత్త దీపావళి ప్రమిదలు ● వివిధ ఆకృతుల్లో తయారీ ● ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారులు ●నూనె ఇంకదు.. ఎన్నెన్నో దీపాలు

దీపావళి సమయంలో చైన్నె నుంచి వచ్చిన ప్రమిదలకు ఎంతో డిమాండ్‌ ఉంటుంది. అన కాపల్లి నుంచి కూడా తీసుకొచ్చి అమ్మకానికి పెడతాం. ఇందులో ఎన్నో రకాల డిజైన్లు అందుబాటు లో ఉన్నాయి. ముఖ్యంగా నూనె పోస్తే ఇంకని ప్రమిదలు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి.

– నిరంజన్‌, అమ్మకందారుడు

శ్రీకాకుళం కల్చరల్‌ :

మరో రెండు రోజుల్లో దీపావళి పండగ. అందరి జీవితాల్లో వెలుగులు నింపే ఈ ఆనందాల వేడుకలో ప్రమిదలది ప్రత్యేక స్థానం. అందరికీ సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ప్రసాదించాలని కోరుతూ దీపం వెలిగించి వేడుక లు ప్రారంభిస్తారు. ఇంతటి ప్రాధాన్యం కలిగి న దీపావళి ప్రమిదలు సరికొత్తగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చా యి. స్థానిక కుమ్మరులు తయారు చేసిన మట్టి ప్రమిదలు మొదలుకొని ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రూపొందించిన వైరెటీ ప్రమిదలు వరకూ వివిధ ఆకృతుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంప్రదాయ మట్టి దీపాలతో పాటు నూనె పోస్తే ఇంకని ప్రమిదలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటోంది.

●పింగాణీతో ప్రత్యేకంగా తయారైన దీపాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వీ టి ధర ఒక్కోటి రూ.40కు విక్రయిస్తున్నారు.

●ఐదు దీపాల ఆకారంలో ఉండే ప్రమిదలో ఒకేసా రి ఐదు దీపాలను వెలిగించవచ్చు. దీని ఖరీదు రూ.60 వరకు అమ్ముతున్నారు.

●రంగురంగుల్లో ఐదు దీపాలు వెలిగించేలా ప్రత్యేక ప్రమిదను తయారు చేశారు. దీని ధర రూ.300 వరకు పలుకుతోంది.

●దీపం ఆకృతిలో ఉండే ప్రమిదలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. దీనిలో దీపం వెలిగస్తే గాలికి ఆరిపోకుండా ఉంటుంది. దీని ఖరీదు రూ.60.

●మట్టితో తయారైన ప్రమిదలో ఐదు వత్తులు వెలిగించేందుకు అవకాశం ఉంటుంది. దీనిఖరీదు రూ.30.

●ఆధ్యాత్మికతను తలపించే తులసి కుండీ ఆకారంలో దీప ప్రమిదలు అమ్ముతున్నారు. ఇవి చిన్న, పెద్ద సైజులలో అందుబాటులో ఉన్నాయి. వీటి ఖరీదు రూ.30 నుంచి మొదలవుతుంది.

●రంగుల్లో దీపాలు ఆరిపోకుండా దీపంపై మూతలు పెట్టే ప్రమీద ఖరీదు రూ.100 వరకు పలుకుతోంది.

దీపం ఆకారంలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement