కాళీ పూజలకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

కాళీ పూజలకు సన్నద్ధం

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

రాయగడ: స్థానిక బ్లాక్‌ కాలనీ సమీపంలోని కాళీ మందిరంలో ఈనెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కాళీ పూజలకు రంగం సిద్ధమవుతోంది. ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గత 43 ఏళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పదకొండు రోజులు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా సుమారు రూ.25 లక్షల వ్యయంతో కాళీమాత ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీన సూర్యపూజ, అవాహన, ప్రాణప్రతిష్ట, శుద్ధి పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. దీనిలో భాగంగా 8వ తేదీ సాయంత్రం స్థానిక జంఝావతి నది నుంచి శుద్ధ జలాలను తీసుకొచ్చి అమ్మవారి మందిరాన్ని శుద్ధి చేయడంతో పూజలకు అంకురార్పణ చేస్తారు. ఈ సందర్భంగా కాళీమాతను మా గురుతార, మా త్రిపుర సుందరి, మా భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్తా, దూమావతి, భగళాముఖి, మాతాంగిణి, మా కమలాత్మిక, బాల్యకుమారి వంటి పూజలను ఈ పదకొండు రోజులు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు దిలిప్‌ పట్నాయక్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement