రాయగడ: జిల్లాలోని బిసంకటక్ పట్టణంలో ధనలక్ష్మి పూజలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గుండిచా ఆలయం సమీపంలో గత 16 ఏళ్లుగా ధనలక్ష్మి అమ్మవారి పూజలను నిర్వాహకులు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలను నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం వేదిక వద్ద నిర్వహించిన ముహూర్తపు రాట పూజల్లో అర్చకులు రామచంద్ర రథ్, కేశవ రథ్‌లు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు అశ్విని రౌత్, శశాంక్ సాహు, అంజన్ సాహు, వి.గోపి, తపన్ మహంతి, సంతోష్ రాజు, శశిభూషణ్ పట్నాయక్, కుంజ రౌత్, రింటు గంతాయిత్ తదితరులు పాల్గొన్నారు.


