అరసవల్లి : ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదిత్యుని కల్యా ణ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించా రు. ఆశ్వీయుజ బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీ వారి ఉత్సవమూర్తులను కల్యాణమూర్తులుగా అలంకరించి ప్రత్యేక మండపంపై వేంచేసింపజేశారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా కల్యాణ సేవ జరిపించారు. అనంతరం సేవలో పాల్గొనే భక్తదంపతులకు స్వామి వారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ, ఇప్పిలి ఫణీంద్రశర్మ, రాజశేఖరశర్మ, మాధవరావు శర్మ తదితరులు పాల్గొన్నారు.


