న్యూస్‌రీల్
ఆంధ్ర స్థానిక ఎన్నికల్లో రహస్యంగా ఓట్లు వేసిన వైనం
ఖంగుతిన్న ఒడిశా నాయకులు,
అధికారులు
–8లోu
శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2026
వరద నష్టాలపై కేంద్ర బృందం సమీక్ష
అర్నబ్ తుఫాన్, అనంతరం సంభవించిన వరదల కారణంగా ఒడిశాలోని వివిధ జిల్లాల్లో జరిగిన నష్టాలపై కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలతో కూడిన ఎనిమిది మంది సభ్యుల బృందం సమీక్ష నిర్వహించింది.
సమస్యలు పరిష్కరించండి
జయపురంలో వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జయపురం సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం గురువారం
అందజేశారు.
–8లోu
శ్రీమందిరం ఆదాయం లెక్కింపు
భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం గురువారం లెక్కించారు. ఇందులో నగదు రూ.3,830,240లు, బంగారం 1 గ్రాముల 200 మిల్లీగ్రాములు, వెండి 17గ్రాముల200 మిల్లీగ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు.
కొరాపుట్:
ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో కొఠియా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీకి చెందిన 21 గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని సారిక, కురుకుటి, తోనాం, మెణింగి గ్రామాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముందురోజు బుధవారం రాత్రి కొఠియా గ్రామ పంచాయతీ నేరడి వలస గ్రామంలో హైడ్రామా నడిచింది. ఆంధ్ర పోలింగ్ సిబ్బందిని ఎదుర్కోవడానికి ఒడిశా ఏకమయ్యింది. సబ్ కలెక్టర్ ఫాభీ రషిద్ నేతృత్వంలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. 7 ప్లాటున్ల పోలీసులు నేరడి వలసలో మోహరించారు. బీజేపీ, బీజేడీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన బృగుభక్షి పాత్రో, మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి, సీఎల్పీ నాయకుడు రామచంద్ర ఖడం, ఎమ్మెల్యేలు తారాప్రసాద్ బాహిణీపతి, పవిత్ర శాంత, రఘురాం మచ్చో, కొరాపుట్ జెడ్పీ చైర్‌పర్సన్ సస్మిత మెలక, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, జయరాం పంగి తదితరులు తమతమ అనుచరులతో రాత్రంతా పహారా కాశారు. ఇదే సమయంలో పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ పీవో ఆర్.వైశాలి అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వచ్చినప్పటికీ వారిని దూరంగానే ఉంచి ఒడిశా నాయకుల వద్దకు చేరుకున్నారు. నేరడి వలసలో తాము పోలింగ్ పెడతామని చెప్పారు. అందుకు ఒడిశా నాయకులు అంగీకరించలేదు. అభ్యంతరం ఉంటే లేఖ ఇవ్వాలని వైశాలి కోరారు. అందుకు కూడా వారు ససేమిరా అన్నారు. దీంతో వైశాలి వెనుదిరిగారు. రాత్రంతా అన్ని పార్టీల నాయకులు నేరడి వలసలో పహారా కాశారు. కానీ ఇదే సమయంలో మిగతా 20 గ్రామాల ప్రజలు వేర్వేరు మార్గాల్లో రహస్యంగా ఆంధ్ర వైపు వెళ్లిపోయారు. దీంతో నేరడి వలస గ్రామంలో తెల్లారేసరికి జన సంచారం తగ్గిపోయింది. మధ్యాహ్నం నేరడి వలస ప్రజలు నెమ్మదిగా తమ ఓటుహక్కు వినియోగించుకొని తిరిగి వచ్చారు. ఇది చూసిన నాయకులు ఖంగు తిన్నారు. బృగు భక్షిపాత్రో, తారా ప్రసాద్‌లు ఓటింగ్‌లో పాల్గొన్నవారితో వాదనలకు దిగారు. ఒడిశాలో ఉంటూ ఆంధ్ర పోలింగ్‌లో పాల్గొన్నవారు ఆంధ్ర తిరిగి వెళ్లి పోవాలని సూచించారు. అనంతరం పోలీసులు, నాయకులు కొఠియా నుంచి వెనుదిరిగారు.


