ఇంటింటా సర్వే సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఇంటింటా సర్వే సమీక్ష

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

మల్కన్‌గిరి: రానున్న మూడు అంచెల పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే పనులను గురువారం రాష్ట్ర ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడు సంగ్రామ్‌ శేఖర్‌ పండా మల్కన్‌గిరి జిల్లా మత్తిలి, ఖోయిర్‌పూట్‌లో పర్యటించి సమీక్షించారు. అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు నిర్ణయించిన గడువులోగా సర్వే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్న రెండు రోజుల్లో కలిమెల, పోడియ, చిత్రకొండ, కోరుకొండ సమితుల్లో కూడా పర్యటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ దుర్యోధన్‌ బోయ్‌, జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి బిమల్‌ కుమార్‌ లెంకా, ఖోయిర్‌పూట్‌ సమితి అధికారి, బూత్‌ లెవల్‌ అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

తుఫాన్‌ సాయం మంజూరు

భువనేశ్వర్‌: ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందజేశారు. సహాయ ప్యాకేజీకి అనుగుణంగా గంజాం, కొరాపుట్‌ జిల్లాల్లో కుటుంబాలకు ఉచిత సహాయంగా నగదు అందించేందుకు రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి సుమారు రూ.107.70 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలో గంజాం జిల్లాకు రూ.107 కోట్ల 44 లక్షల 55 వేలు విడుదల చేయగా, కొరాపుట్‌ జిల్లాకు రూ.26 లక్షల 27 వేల 500 మంజూరు చేశారు. ముఖ్యమంత్రి సహాయ ప్యాకేజీ కింద ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2,500 చొప్పున గంజాం జిల్లాలో తుఫాన్‌ వల్ల ప్రభావితమైన 4,29,782 కుటుంబాలు, కొరాపుట్‌ జిల్లాలోని 1,051 ప్రభావిత కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా, సంబంధిత జిల్లా కలెక్టర్లు అర్హులైన బాధిత కుటుంబాలకు ఉచిత సహాయం కింద ఈ నిధులను పంపిణీ చేయడానికి వినియోగిస్తారు.

అంగన్‌వాడీలకు శిక్షణ

జయపురం: జయపురం సబ్‌ డివిజన్‌ బొరిగుమ్మలో మమతా, ప్రధానమంత్రి మాతృ వందన పథకాలపై అంగన్‌వాడీలకు గురువారం శిక్షణ నిర్వహించారు. బొరిగుమ్మ సమితి కార్యాలయ ప్రాంగణంలోని రాజీవ్‌ గాంధీ సేవా కేంద్రంలో సమన్విత శిశు వికాస విభాగం ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. సమితి సీడీపీవో లక్ష్మీప్రియ జానీ అధ్యక్షతన 5 రోజుల పాటు శిక్షణ చేపట్టనున్నారు. కార్యక్రమంలో సామాజిక సంక్షేమ విభాగ జిల్లా కో–ఆర్డినేటర్‌ సీమా రాణి బెహర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement