హాస్టల్‌ భోజనంలో కప్ప | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ భోజనంలో కప్ప

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

● ఉత్కల్‌ క్యాంపస్‌లో కలకలం

● ఉత్కల్‌ క్యాంపస్‌లో కలకలం

భువనేశ్వర్‌: ఉత్కల్‌ విశ్వవిద్యాలయం హాస్టళ్లలో ఆహార భద్రత, పరిశుభ్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కామెర్ల వ్యాప్తితో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా, మహిళా హాస్టల్‌లో వడ్డించిన భోజనంలో చనిపోయిన కప్ప కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేడీస్‌ హాస్టల్‌ నంబర్‌–7లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులకు వడ్డించిన చిల్లీ సోయాబీన్‌ కూరలో చనిపోయిన కప్ప కనిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో హాస్టల్‌లో అందిస్తున్న ఆహార నాణ్యత, వంటశాలల పరిశుభ్రతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, హాస్టల్‌లో కామెర్ల కేసులు పెరుగుతుండటం విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళనను మరింత పెంచుతోంది. ఇప్పటికే ఇద్దరు విద్యార్థినులకు కామెర్లు ఉన్నట్లు నిర్ధారణ కాగా, అనుమానితులుగా ఉన్న మరో పది మందికి పైగా విద్యార్థినుల రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. కామెర్ల వ్యాప్తికి గల అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ నేపథ్యంలో హాస్టల్‌లోని ఆహారం, తాగునీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ప్రత్యేక బృందం సైతం ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపింది.

కామెర్ల కట్టడికి చర్యలు..

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు విశ్వవిద్యాలయ అధికారులు పలు చర్యలు చేపట్టారు. హాస్టళ్లకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడంతో పాటు, క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాల్లో వేడినీటి బాయిలర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాంపస్‌లోని అన్ని ఆహార విక్రయ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. విద్యార్థుల సమస్యలు, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement