కళింగ వైశ్య సంఘం మహిళా విభాగం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

కళింగ వైశ్య సంఘం మహిళా విభాగం ఏర్పాటు

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

రాయగడ : కొత్తపేట కళింగ వైశ్య సంఘం మహిళా విభాగం ఏర్పాటయ్యింది. బుధవారం కొత్తపేటలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా కె.నమ్రత, ఉపాధ్యక్షురాలిగా పెద్దిన రమ్య, కార్యదర్శిగా పెద్దిన సంయుక్త, సహ కార్యదర్శిగా కొరపాన యమున, కోశాధికారిగా వూళ్ల దివ్య నియమితులయ్యారు. ఈ సందర్బంగా కొత్తపేట కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తకోట శ్రీధర్‌ మాట్లాడుతూ సంఘం సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంతో పాటు మహిళలకు సేవా కార్యక్రమాలపై ఆసక్తి కలిగించేలా సంఘం ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement