కొఠియా వివాదానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

కొఠియా వివాదానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే పరిష్కారం

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

జయపురం: ఒడిశా– ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య రగులుతున్న కొఠియా వివాద శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక దండకారణ్య రాష్ట్ర ఏర్పాటే మార్గమని మాజీ ఎంపీ, ఆదివాసీ నేత జయరాం పంగి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అవిభక్త కొరాపుట్‌ జిల్లాలోని కొరాపుట్‌, నవరంగపూర్‌, రాయగడ, మల్కనగిరి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిపాదిత దండకారణ్య రాష్ట్రంలో ఒడిశాకు చెందిన 42 సమితులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 సమితులు, మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్‌సభ స్థానాలు ఉండాలన్నారు.

బీజీపీ మాజీ అధ్యక్షుడు

గోపాలరావు మృతి

పర్లాకిమిడి: సీనియర్‌ అడ్వకేట్‌, బీజేపీ మాజీ అధ్యక్షుడు ముల్లి గోపాలరావు (72) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె, కోడలు వున్నారు. గజపతి జిల్లాలో 1995లో బీజేపీకి ప్రథమ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో అదే పార్టీ తరఫున పర్లాకిమిడి ఎమ్మెల్యేగా పోటీచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఒడిశా మాజీ గవర్నర్‌ కంభంపాటి హరిబాబుతో మంచి అనుబంధం ఉంది. గోపాలరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు, కోశాధికారి వి.వరదరాజు, మాజీ అధ్యక్షులు తిరుపతి నాయక్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణిమా సాహు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement