రోడ్డు వేస్తారా? ఆంధ్రాలో కలిపేస్తారా? | - | Sakshi
Sakshi News home page

రోడ్డు వేస్తారా? ఆంధ్రాలో కలిపేస్తారా?

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

రోడ్డు వేస్తారా? ఆంధ్రాలో కలిపేస్తారా? ● ఎంపలవలస గ్రామస్తుల ఆందోళన ● బురద రోడ్డుపై నిరసన

● ఎంపలవలస గ్రామస్తుల ఆందోళన ● బురద రోడ్డుపై నిరసన

రాయగడ :

సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి మాటలకే పర మితమైందని, కనీసం పక్కా రహదారి కూడా నిర్మించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ కెరడ పంచాయతీ ఎంపలవలస గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని బురద రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో నిరసన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

రెండేళ్లుగా హామీలే..

ఆంధ్రప్రదేశ్‌లొని కొమరాడ మండలం పుడుగువాలస వరకు రహదారి నిర్మాణానికి రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఒడిశా రాష్ట్ర భూభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రహదారి నిర్మిస్తున్నట్లు గుర్తించిన జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని పనులను నిలిపివేసింది. ఆ సమయంలో ఒడిశా అధికారులు గ్రామస్తులకు తమ ప్రభుత్వమే పక్కా రహదారి నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు గడిచి నా రహదారి నిర్మాణంలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో గ్రామస్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ సమస్యపై గ్రామస్తులు మూడు నాలుగు సార్లు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.

వర్షాకాలంలో నరకయాతన

గ్రామానికి పక్కా రహదారి లేకపొవడంతో వర్షాకాలంలొ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురద మార్గంలో రాకపోకలు సాగించడం కష్టంగా మారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ కూడా గ్రామానికి చేరుకోలేని దుస్థితి నెలకొంది. తాగునీరు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలూ అందడం లేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు సౌకర్యాలు అందుతున్నాయని, తమకు కనీసం రహదారి కూడా నిర్మించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చివరి దశలో టెండర్‌..

ఈ విషయమై జిల్లా అదనపు కలెక్టర్‌ రవీంద్ర నాద్‌ కుహరో స్పందిస్తూ వనిజా వైపు వెళ్లే 2.8 కిలొమీటర్ల రహదారి నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. టెండర్‌ ఖరారైన వెంటనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మరోరహదారిని ముఖ్యమంత్రి సడక్‌ యోజనలో చేర్చామని, అది డీపీఆర్‌ దశలో ఉందని పేర్కొన్నారు.

కొఠియా తరహా వివాదం తప్పదా?

సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉనికిని బలంగా చాటుతుందని మేధావులు అభిప్రాయపడుతు న్నారు. కేవలం హామీలు, ప్రకటనలతో కాకుండా కార్యాచరణ ప్రారంభించాలని కోరుతునఆనరు. లేనిపక్షంలో కొరాపుట్‌ జిల్లా కొఠియా ప్రాంతంలో నెలకొన్న సరిహద్దు వివాదాల తరహా పరిస్థితులు రాయగడ జిల్లాలోనూ ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రహదా రులు, తాగునీరు, వైద్య సేవలు, సంక్షేమ పథకాల ను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement