గోసమ్మాన్‌కు తరలిరండి | - | Sakshi
Sakshi News home page

గోసమ్మాన్‌కు తరలిరండి

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

గోసమ్మాన్‌కు తరలిరండి అల్లాడ చెరువులో మొసలి?

పర్లాకిమిడి: గోసమ్మాన్‌ ఆహ్వానం ప్రచారం సందర్భంగా స్థానిక పెద్దరాధాకాంత మఠంలో అమృతానంద గిరి మహారాజ్‌, క్రాంతి స్వరూపానంద గిరి, కేంద్రియ నంది బాబాతో సహా పలువురు సాధుసంతువులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్‌ 17న భువనేశ్వర్‌లో జరుగనున్న గోసమ్మాన్‌ ఆహ్వాన్‌ అభియాన్‌లో అందరూ పాల్గొనలాని స్వరూపానంద గిరి అన్నారు. గోమాతాల సురక్ష, సమ్మాన్‌, సంరక్షణ కోరకు అందరూ కలిసి సమాజంలో జాగృతం చేయాలని అమృతానంద గిరి అన్నారు. ఈ కార్యక్రమంలో కై లాష్‌ చంద్ర గౌడో, మహాంత సత్యనారాయణ దాస్‌ మహారాజ్‌, గిన్నికుమార్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి రమేష్‌ చంద్ర పాత్రో, గోసేవ, సంవర్ధన ప్రముఖులు మనోజ్‌ దాస్‌, తదితరులు పాల్గొన్నారు.

యువకుడు ఆత్మహత్యాయత్నం

టెక్కలి రూరల్‌: స్థానిక ఎన్టీఆర్‌ పార్క్‌ ఆవరణలో బుధవారం యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తలగాం గ్రామానికి చెందిన బొమ్మాళి శ్రీను అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఎన్టీఆర్‌ పార్కు సమీపంలో గడ్డిమందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు.

కూలిన ఇంటి గోడ

టెక్కలి రూరల్‌: గత కొద్ది రోజులుగా తుఫాన్లు కారణంగా కురిసిన వర్షాలతో మండలంలోని పాత నౌపడ గ్రామంలో ఒక ఇంటి గోడ కూలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పాత నౌపడ గ్రామానికి చెందిన గాలి నీలకంఠేశ్వరరావు తన భార్య, పిల్లలతో కలిసి తనకు చెందిన మట్టిగోడలతో ఉన్న రేకుల షెడ్‌ ఇంట్లో నివాసముంటున్నారు. అయితే వర్షాలకు మట్టిగోడలు తడిచిపోవడంతో బుధవారం వేకువజామున ఇంటిగోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

జలుమూరు: అల్లాడ గ్రామ శివారు పెద్ద చెరువులో మొసలి తిరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వేకువజామున సుమారు 10 నుంచి 12 అడుగుల పొడవుతో చెరువు మధ్యలో ఉన్న శివుడి విగ్రహం చుట్టూ తిరిగిందని చెబుతున్నారు. కార్యదర్శి చిన్నారావు సమాచారం మేరకు టెక్కలి అటవీశాఖ అధికారులు, సెక్యూరిటీ బీట్‌ అధికారి ఎస్‌.కృష్ణారావు, అసిస్టెంట్‌ బీట్‌ అధికారి సీహెచ్‌ కృష్ణారావులు వచ్చి పరిశీలించారు. అరగంటకోసారి కళ్లు బయటకు కనిపిస్తున్నా మొసలి మాత్రం కాదని చెబుతున్నారు. పూర్తిగా సమాచారం తెలిసే వరకు ఎవరూ నీటిలో ఎవరూ దిగవద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement