రాయగడ : గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక గర్భిణులు, రోగులకు డోలీ పాట్లు తప్పడం లేదు. పద్మపూర్ సమితి నువాగడ పంచాయతీ సాటి గ్రామానికి పక్కా రహదారి లేకపోవడంతో 108 అంబులెన్స్ చేరుకోలేకపొయింది. దీంతో ప్రసవవేదనతో బాధపడుతున్న గర్భిణి రిబికా మాఝిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అంబులెన్స్ సిబ్బంది కలిసి 5 కిలోమీటర్లు డోలీపై మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం పద్మపూరం సామూహిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అంబులెన్స్ టెక్నీషియన్ జశ్వంత్ నాయక్, పైలట్ వినోద్ కుమార్ సాహుకార్, అటెండెంట్ ప్రమోద్ జెన్నా, ఆశా కార్యకర్త సుమతి మాఝి పాల్గొన్నారు.


