ఇంటింటా సర్వే పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఇంటింటా సర్వే పరిశీలన

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

ఇంటింటా సర్వే పరిశీలన

రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌ సమితితోపాటు మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇంటింటా ఓటర్ల జాబితా సర్వే పనులను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు భగవాన్‌ బెహరా బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. సర్వే పనుల పురోగతి, నిర్వహణ తీరును స్వయంగా తనిఖీ చేశారు. ఈ పర్యనటలో రాయగడ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సూర్యనారాయణ మహరణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుణుపూర్‌ సమితి పరిధిలోని చాలకంబ గ్రామ పంచాయతీతోపాటు గుణుపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బలరాం నగర్‌, ఆదర్శ్‌నగర్‌, త్రినాథ మందిరం బూత్‌ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల సేకరణ ఏవిధంగా జరుగుతుందనే అంశాలను పరిశీలించారు. మున్సిపాలిటీ ప్రాంతంలో పర్యటన సందర్భంగా గుణుపూర్‌ మున్సిపాలిటీ ఈఓ సంతోష్‌ నాయక్‌, బీఎల్‌ఓ తాపస్‌ పట్నాయక్‌, శుభాశీష్‌ స్వయ్‌, బీఎల్‌ఓ భవానీ కుమారి శతపతి తదితరులు పాల్గొని సర్వేపనుల పురోగతిని పరిశీలకుడికి వివరించారు. అదేవిధంగా సమితి పరిధిలో పర్యటించిన సమయంలో గుణుపూర్‌ బీడీఓ స్వస్థిక్‌ జామాదార్‌ కూడా పాల్గొన్నారు. క్షేత్రస్థాయి తనిఖీల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు సిబ్బందితో సమావేశమై సర్వే నిర్వహణ తీరుపుపై సమీక్షించారు. ఓటర్ల జాబితా సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పారదర్శకంగా, సమర్థవంతంగా పనులు పనులు పూర్తిచేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలు, సలహాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement