భువనేశ్వర్: రౌర్కెలాలోని హైటెక్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు రోగుల చికిత్సా విధానాలు, మురికివాడల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడే ఆధునిక శాసీ్త్రయ పద్ధతుల నమూనాలను ప్రదర్శించారు. వినూత్న వైద్య విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నమూనాలు ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. ఈ నమూనాల ఆధారంగా విద్యార్థులు భవిష్యత్‌లో మరింత మెరుగైన వైద్య పరిజ్ఞానాన్ని సంపాదించడంతో పాటు ప్రజలకు చేరువై సేవలందించగలరని కళాశాల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వైద్య విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రాకేశ్ కుమార్ పాణిగ్రాహి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుశాంత్ ఆచార్య, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రావంతి మెటు, జ్యోతిర్మయ్ పండా, ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్ మహంతి తదితరులు పాల్గొన్నారు.


