మళ్లీ కూలిన మట్టిపెళ్లలు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కూలిన మట్టిపెళ్లలు

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

రాయగడ: స్థానిక మంకొడొజోల కమ్యూనిటీ హాల్‌ సమీపంలో నాగావళి నది ఒడ్డున మరోసారి మట్టి పెళ్లలు జారిపడ్డాయి. అర్నబ్‌ తుఫాన్‌ అనంతరం కురిసిన భారీ వర్షాలకు నదీ తీరంలో సుమారు రెండు అడుగుల మేర మట్టి కోతకు గురయ్యింది. కమ్యూనిటీ హాల్‌ నుంచి ప్రవహించిన వర్షపు నీరుతో మట్టి కొట్టుకుపోవడంతో భవనం సమీపంలో నేల కుంగిపోయింది. దీంతో ఇప్పటికే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కమ్యూనిటీ హాల్‌ భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ.2.12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భారీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలు ఇప్పుడు తీవ్ర సమస్యగా మారాయి. ప్రతీ వర్షాకాలంలోనూ ప్రమాదం మరింత చేరువవుతున్పప్పటికీ సంబంధిత గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు పరిస్థితిని చూస్తూ ఉండిపోవడం తప్ప శాశ్వత పరిష్కారం చూపించలేకపొతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణం పూర్తయినప్పటికీ భవనం స్థిరత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు

అర్నబ్‌ తుపాను అనంతర వర్షాలతో తాజాగా మరోరెండు అడుగుల మేర మట్టి కోతకు గురైంది. వర్షపు నీరు ప్రవహించిన ప్రాంతంలో నేల లోతుగా కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి. దీంతో కమ్యూనిటీ హాల్‌కు ప్రమాదం మరింత పెరిగిందని స్థానికులు భావిస్తున్నారు. సుమారు నెల రోజుల క్రితం అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు మూడు అడుగుల మేర మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. తాజాగా మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవ్వడంతో భవనం భద్రతపై ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement