పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్‌లోని పలు పంచాయతీల్లో మురసు తుఫాన్‌పై ప్రజలకు అంగన్‌వాడీ వర్కర్లు మైకు ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి ఆర్.ఉదయగిరిలో వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అదనంగూడ గ్రామానికి రోడ్డు వేయాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మబ్లాక్ జామి గ్రామపంచాయతీ అదనంగూడ ఆదివాసీ సరైన రోడ్డు లేకపోవడంతో తమ పిల్లలు చదువుకోవడానికి, రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం కలెక్టరేట్‌లో ఒక వినతిని గ్రామస్తులు ఏడీఎం మునీంద్ర హానగకు అందజేశారు. అత్యవసర వైద్య సేవలకు వెళ్లడానికి సరైన మార్గం లేదని, అందువల్ల బ్లాక్ అధికారులు పక్కా రోడ్డు వేయాలని అధికారులకు విన్నవించారు
50 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: కారులో జంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకుని, వారి నుంచి 50 కిలోల గంజాయి, కారును జిల్లాలోని పద్మపూర్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గజపతి జిల్లా పరిధిలోని అడవ ప్రాంతం నుంచి మునిగుడ వైపు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు వాహన తనిఖీలను నిర్వహించారు. పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలకపొంగ వద్ద కారులో గంజాయి అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కారుని ఆపి తనిఖీ చేయగా 50 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు ఝార్ఖండ్ ప్రాంతానికి చెందిన జమ్‌షెడ్‌పూర్‌లో గల మహమ్మద్ ఇజాజ్, గౌరవ్ కుమార్ సాహు, గజపతి జిల్లా ఒడవా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖయిరాగుడ గ్రామానికి చెందిన మనోజ్ బీర్‌గా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి గునుపూర్ ఏడీజే కోర్టులో ప్రవేశపెట్టారు.
పర్లాకిమిడి: రాష్ట్రమంతటా సంచలనం రేపిన మాజీ ఏసీఎఫ్ సౌమ్యరంజన్ మహాపాత్రో కేసులో ఆయన భార్య బిధ్యాభారతి పండా సోమవారం జిల్లా సెషన్స్‌కోర్టులో లొంగిపోయారు. అంతకుముందు బిధ్యాభారతి పండా హైకోర్టు, సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా న్యాయమూర్తి తిరస్కరించడంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ అందజేయాల్సి ఉంది. కానీ అంతకుముందే ఆమె సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో పర్లాకిమిడి కోర్టులో హాజరై లొంగిపోయారు. 2021 జూలై 12లో స్థానిక డీఎఫ్‌ఓ కార్యాలయం కాంపౌండ్‌లో సిబ్బంది నివాసగృహంలో అప్పటి ఏసీఎఫ్ సౌమ్యరంజన్ మహాపాత్రో తన గదిలో కాలిపోయి, 90 శాతం గాయాలతో కటక్ మెడికల్‌లో చేరారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి డీఎఫ్‌ఓ సంగ్రాం కేసరి బెహారా ఇప్పటికే సబ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. రెండో నిందితురాలు బిధ్యాభారతి పండా కోర్టులో సోమవారం ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి మధ్యాహ్నం విచారణకు వచ్చింది. మధ్యాహ్నం రెండుగంటల సమయంలో బిధ్యాభారతి పండా బెయిల్ పిటిషన్ సెషన్స్ జడ్జి తిరస్కరించడంతో ఆమెను పర్లాకిమిడి ఉప కారాగారానికి తరలించారు. ఆమెను 13 రోజులపాటు విచారణ జ్యుడీషియల్ కస్టడీలో ఉంచుతారని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా తెలియజేశారు. ఆమె తిరిగి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్‌కు దాఖలు చేయనున్నట్టు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఇప్పటికే మాజీ డీఎఫ్‌ఓ సంగ్రాం కేసరి బెహారా లొంగిపోగా, మూడో నిందితుడు మన్మధ కుంభో కూడా కేసులో ఉన్నాడు.


