తూర్పు కోస్తా రైల్వేలో ముమ్మర టికెట్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

తూర్పు కోస్తా రైల్వేలో ముమ్మర టికెట్‌ తనిఖీలు

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

– యూటీఎస్‌ బుకింగ్‌లు 29 శాతం పెరుగుదల

భువనేశ్వర్‌: టికెట్‌ లేకుండా ప్రయాణాలను నిరోధించి, ప్రయాణికుల్లో టికెట్‌ కొనుగోలు పట్ల క్రమశిక్షణ పెంపొందించేందుకు తూర్పు కోస్తా రైల్వే (ఈసీఓఆర్‌) చేపట్టిన ముమ్మర తనిఖీలు సత్ఫలితాలనిస్తున్నాయి. భువనేశ్వర్‌, సంబల్‌పూర్‌ సహా ప్రధాన స్టేషన్లలో నిర్వహించిన ఈ తనిఖీల నేపథ్యంలో యూటీఎస్‌ (అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) టికెట్‌ బుకింగ్‌లు పెరిగాయి. ముఖ్యంగా తనిఖీలు నిర్వహించిన రోజున బుకింగ్‌లు 29 శాతం అధికంగా నమోదయ్యాయి. ఈసీఓఆర్‌ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం, డివిజన్ల సిబ్బంది సమన్వయంతో ఈ తనిఖీలు చేపడుతున్నారు. టికెట్‌ లేకుండా ప్రయాణించేవారిని గుర్తించడంతో పాటు, రైలెక్కే ముందే చెల్లుబాటయ్యే టికెట్‌ కొనుగోలు చేయాలనే అవగాహన కల్పిస్తున్నారు. జరిమానాల వసూలుకే పరిమితం కాకుండా అక్రమ ప్రయాణాల నివారణ, రైల్వే ఆదాయ పరిరక్షణ, టికెట్‌ తీసుకుని ప్రయాణించే వారికి న్యాయం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యమని ఈసీఓఆర్‌ తెలిపింది. 2026 ఏప్రిల్‌ నుంచి యూటీఎస్‌ బుకింగ్‌లలో నమోదవుతున్న వృద్ధి ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొంది. ప్రధాన స్టేషన్లలో ఈ తనిఖీలను క్రమం తప్పకుండా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రస్థాయి మహక్‌ –2026 వేడుకకు 16 మంది ఎంపిక

మల్కన్‌గిరి : ఒడిశా ప్రఽభుత్వ మహిళా, శిశు అబివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నవంబర్‌ 3 నుంచి 7వ తేదీ వరకు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో రాష్ట్రస్థాయి మహక్‌–2026 కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వివిధ బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్న చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. మల్కన్‌గిరి కలెక్టర్‌ ప్రథమేశ్‌ అరవింద్‌ రాజేశిర్కే ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో 16మందిని ఎంపిక చేశారు. వీరికి ప్రత్యేక బస్సుల్లో భువనేశ్వర్‌కు పంపించారు. చిన్నారులతో పాటు కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement